ఎన్నాళ్లకెన్నాళ్లకు! | Kamal Haasan's Vishwaroopam 2 Revived | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Apr 22 2017 12:47 AM | Updated on Sep 5 2017 9:20 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం–2’ విడుదలవుతుందని ఎవరూ ఊహించలేదు. ‘విశ్వరూపం’ విడుదలై నాలుగేళ్లు అయ్యింది.

కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం–2’ విడుదలవుతుందని ఎవరూ ఊహించలేదు. ‘విశ్వరూపం’ విడుదలై నాలుగేళ్లు అయ్యింది. అప్పట్లో పలు వివాదాలు సినిమాను చుట్టుముట్టినా... కమల్‌ క్రియేటివిటీకి మంచి పేరొచ్చింది. కానీ, ఏం లాభం? సెకండ్‌ పార్టు షూటింగ్‌ పూర్తయినా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల ఆగిందన్నారు. ‘విశ్వరూపం’ విడుదల తర్వాత కమల్‌ మరో మూడు సినిమాలు చేయడంతో ప్రేక్షకులు పార్ట్‌–2 సంగతి మర్చిపోయారు.

లేటెస్ట్‌ న్యూస్‌ ఏంటంటే... ‘విశ్వరూపం–2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ మళ్లీ మొదలయ్యాయి. ‘‘పాత టీమ్‌తోనే వర్క్స్‌ జరుగుతున్నాయి. తెలుగు, హిందీ డబ్బింగ్‌ వర్క్స్‌ మొదలయ్యాయి’’ అని కమల్‌ శిష్యుడు, ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్‌ సెల్వ ట్వీటారు. కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వి. రవిచంద్రన్‌ నిర్మాత, జిబ్రాన్‌ స్వరకర్త. రాహుల్‌ బోస్, పూజా కుమార్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement