అందుకే ‘కాళిచరణ్’కు ఓకే చెప్పాను
‘‘కె.భాగ్యరాజా నా గురువు. ఆయన రూపొందించిన ‘సిద్దూ ప్లస్ 2’ చిత్రం ద్వారానే నేను కథానాయికగా పరిచయమయ్యాను. భాగ్యరాజాగారి వద్ద నుంచి
‘‘కె.భాగ్యరాజా నా గురువు. ఆయన రూపొందించిన ‘సిద్దూ ప్లస్ 2’ చిత్రం ద్వారానే నేను కథానాయికగా పరిచయమయ్యాను. భాగ్యరాజాగారి వద్ద నుంచి నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను’’ అని చాందిని తమిళరాసన్ అన్నారు. ‘కాళిచరణ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారీమె. చైతన్యకృష్ణ కథానాయకునిగా శ్రీప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చాందిని విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘‘తొలి సినిమా చేశాక... డిగ్రీ పూర్తి చేసే నిమిత్తం నటనకు కొంత విరామం ఇచ్చాను. ఓ తమిళ పత్రిక కవర్‌పేజీపై నా స్టిల్ చూసి శ్రీప్రవీణ్ నన్ను సంప్రదించారు. నటనకు మంచి అస్కారమున్న పాత్ర కావడంతో వెంటనే ‘కాళిచరణ్’కు అంగీకారం తెలిపాను. ఇందులో నా పాత్ర పేరు తీర్థ. బ్రాహ్మణ యువతి పాత్ర. లుక్ పరంగా కాస్త డీ గ్లామరైజ్డ్‌గా ఉంటాను. ఈ పాత్ర కోసం నా శారీరకభాషను కూడా మార్చుకున్నాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. శ్రీదేవి, జ్యోతికలు నటిగా తనకు స్ఫూర్తి అని, తాను పవన్‌కల్యాణ్ వీరాభిమానినని చాందిని చెప్పారు.