పద్నాలుగు రోజుల ప్రేమ | Sakshi
Sakshi News home page

పద్నాలుగు రోజుల ప్రేమ

Published Sat, Dec 30 2023 1:17 AM

14 days love movie releasing on january 5 2024 - Sakshi

మనోజ్‌ పుట్టూర్, చాందినీ భాగవని జంటగా నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన చిత్రం ‘14 డేస్‌ లవ్‌’. అఖిల్‌ అండ్‌ నిఖిల్‌ సమర్పణలో హరిబాబు దాసరి నిర్మించిన ఈ సినిమా జనవరి 5న విడుదలకానుంది.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ లవ్‌ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా ‘14 డేస్‌ లవ్‌’ రూపొందింది. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే కోణంలో ఈ చిత్రం ఆసక్తిగా సాగుతుంది’’ అన్నారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement