కాజల్‌కు లక్కీచాన్స్‌

Kajal Aggarwal Romance With Jayam Ravi - Sakshi

తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటీమణుల్లో  కాజల్‌అగర్వాల్‌ ఒకరని చెప్పకతప్పదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోలతో నటించిన ఈ బ్యూటీ ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్, విశాల్, ధనుష్, కార్తీ వంటి స్టార్స్‌తో రొమాన్స్‌ చేసింది. అంతేకాదు బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది. అయితే ఆక్కడ ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి దక్షిణాదిపైనే దృష్టి సారించింది. కోలీవుడ్‌లో వివేకం, మెర్శల్‌ వంటి చిత్రాలతో సక్సెస్‌ అందుకుంది. అయినా కారణాలేమైనా ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కితున్న ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం మినహా మరే చిత్రం కాజల్‌ అగర్వాల్‌ చేతిలో లేదు.

అదే విధంగా తెలుగు, కన్నడ భాషలో ఒక్కో చిత్రం చేస్తోంది. దీంతో కాజల్‌ జోరు తగ్గిందనే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌కు కోలీవుడ్‌లో ఒక లక్కీచాన్స్‌ వరించిందన్నది తాజా సమాచారం. ఇక్కడ ఈ అమ్మడు చాలామంది స్టార్స్‌తో జత కట్టినా, హీరోయిన్లకు లక్కీ హీరోగా పెరొందిన జయంరవితో మాత్రం ఇంత వరకూ రొమాన్స్‌ చేయలేదు. అయితే ఆ అవకాశం ఇన్నాళ్లకు కాజల్‌ అగర్వాల్‌ తలుపు తట్టింది. జయంరవి టిక్‌ టిక్‌ టిక్‌ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రస్తుతం అడంగ మను చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేసే జయంరవి తాజాగా మరో కొత్త చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నట్లు సమాచారం. ఇందులో జయంరవికి జంటగా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తాజా న్యూస్‌. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా జయంరవి సరసన నటించిన హీరోయిన్లందరూ ఆ తరువాత బిజీ అయిపోతుంటారు. కాజల్‌ అగర్వాల్‌ కూడా కోలీవుడ్‌లో మరో రౌండ్‌ కొడుతుందేమో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top