ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్ | K Vishwanath Quitting From Movies | Sakshi
Sakshi News home page

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

Aug 11 2019 5:44 PM | Updated on Aug 11 2019 9:15 PM

K Vishwanath Quitting From Movies - Sakshi

కేసీఆర్ నా ఇంటికి రావడం అంటే శ్రీకృష్ణుడు కుచేలుడు ఇంటికి ...

సాక్షి, హైదరాబాద్‌ : ఇకపై తాను సినిమాలు తీయనని ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితులపై వస్తున్న పుకార్లను ఆయన తోసిపుచ్చారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత పనిమీద మధ్యాహ్నం విశ్వనాథ్‌ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. అనంతరం కే విశ్వనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మర్యాద పూర్వకంగానే సీఎం కేసీఆర్‌ నా వద్దకు వచ్చారు. నేను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదు. సినిమాలో పాట నచ్చి నన్ను కలుస్తా అని కేసీఆర్‌ రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్ నా ఇంటికి రావడం అంటే శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్లు. నా అభిమానిగానే ఆయన మా ఇంటికి వచ్చార’’ని వెల్లడించారు.

శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం, స్వాతి కిరణం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్‌ 2010లో చివరిసారిగా శుభప్రదం సినిమాను తెరకెక్కిం‍చారు. తరువాత పలు చిత్రాల్లో నటుడిగా కనిపించినా ఇటీవల వయోభారం కారణంగా సినీరంగానికి దూరంగా ఉంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement