ముద్దుకి ముందు... ఈ టిప్స్‌ పాటించండి!

Julie 2 postponed again; to now release on November 24th - Sakshi

మీకు సిగరేట్‌ తాగే అలవాటుందా? అయితే... నోటిని శుభ్రంగా కడుక్కోండి! లేదా నోట్లో చూయింగ్‌ గమ్‌ వేసుకొండి! – ఎవరినైనా ముద్దు పెట్టుకోవడానికి ముందు మీరు తప్పకుండా ఫాలో కావలసిన ఫస్ట్‌ టిప్‌. శరీరం నుంచి దుర్వాసన (బ్యాడ్‌ స్మెల్‌) రాకుండా చూసుకోవడం... సెకండ్‌ టిప్‌! ఈ రెండు టిప్స్‌ ఎవరు చెప్పారో తెలుసా? ‘ఖైదీ నంబర్‌ 150’లో రత్తాలు పాటలో హాట్‌ హాట్‌గా కనిపించిన రాయ్‌ లక్ష్మీ.

ఆన్‌ స్క్రీన్‌ అయినా... ఆఫ్‌ ద స్క్రీన్‌ అయినా... ఈ టిప్స్‌ అందరికీ ఉపయోగపడతాయేమో కదూ! మూడో టిప్‌ కూడా ఉందండోయ్‌! అయితే... అది నటీనటులకు మాత్రమే, ప్రేక్షకులకు కాదు. అదేంటంటే... కిస్సింగ్‌ సీన్‌ లేదా రొమాంటిక్‌ సీన్స్‌లో నటించేటప్పుడు సెట్‌లో ఎవరున్నా, ఎంతమంది ఉన్నా... మర్చిపోమ్మని సెలవిచ్చారు. ఇప్పుడీ టిప్స్‌ అన్నీ ఎందుకంటే... రాయ్‌ లక్ష్మీ నటించిన హాట్‌ హిందీ సిన్మా ‘జూలీ–2’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదీ సంగతి! అన్నట్టు... ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Back to Top