అమ్మకు నచ్చిన పాట!

Jayalalitha Listened to 'Kannalane' at Rahman's Studio - Sakshi

రెహమాన్‌... భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు. కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా నార్త్‌ నుంచి సౌత్‌.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆయన సంగీతం నచ్చుతుంది. తమిళ తలైవి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ జాబితాలో ఉన్నారు. రెహమాన్‌ పాటల్లో ఆమె ఎంజాయ్‌ చేసింది ‘బొం బాయి’ సినిమాలో ‘కన్నానులే కలలు..’ సాంగ్‌ అట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు చెప్పారు. మణిరత్నం, రెహమాన్, వైరముత్తు కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. తాజాగా వస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్‌’(తెలుగులో నవాబ్‌).

ఈ చిత్రం ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. మీ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందిన పాటల్లో మీకేది ఇష్టం? అని అడిగిన సందర్భంలో కొన్ని పాటలు చెప్పడంతో పాటు ఓ ఫ్లాష్‌బ్యాక్‌ సంఘటనని వైరముత్తు పంచుకున్నారు – ‘‘ఒకసారి జయలలితగారు రెహమాన్‌ స్టూడియోను సందర్శించారు. అప్పుడు రెహమాన్‌తో ‘నువ్వు కంపోజ్‌ చేసిన లేటెస్ట్‌ సాంగ్‌ ఏదైనా ఉంటే ప్లే చేయి’ అని అడిగారట. వెంటనే రెహమాన్‌ ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే కలలు..’ సాంగ్‌ పాడి వినిపించారట. ఆ పాటను జయలలిత బాగా ఎంజాయ్‌ చేశారు’’ అని ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని  షేర్‌ చేశారాయన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top