ఐరన్‌ లేడీ

jayalalitha biopic the iron lady first look release - Sakshi

2016 డిసెంబర్‌ 5... నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజలు ‘అమ్మ’ అని ప్రేమగా పిలిచే జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన రోజు. ఆ తర్వాత తమిళనాట రాజకీయాల్లో చాలా గందరగోళమే ఏర్పడింది. అది అప్రస్తుతం. ఈ ఏడాది జయలలిత జీవితం ఆధారంగా సుమారు నాలుగు వరకూ బయోపిక్‌లను అనౌన్స్‌ చేశారు తమిళ దర్శకులు. అందులో లేడీ డైరెక్టర్‌ ప్రియ దర్శని తెరకెక్కించనున్న ‘ది ఐరన్‌ లేడీ’ ఒకటి. జయలలిత రెండో వర్ధంతి సందర్భంగా ‘ది ఐరన్‌ లేడీ’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. నిత్యా మీనన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాను పేపర్‌ టేల్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘‘ఐరన్‌ లేడీ, అమ్మ’ జయలలితగారి రెండో వర్ధంతి సందర్భంగా ఆవిడకు నా నివాళి అర్పిస్తున్నాను’’ అని నిత్యామీనన్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top