ప్రేమలో జవాన్‌ | Jawaan : Sai Dharam Tej's patriotic thriller confirmed for September 1 | Sakshi
Sakshi News home page

ప్రేమలో జవాన్‌

Jun 28 2017 11:00 PM | Updated on Sep 5 2017 2:42 PM

ప్రేమలో జవాన్‌

ప్రేమలో జవాన్‌

చేతిలో సెల్‌ఫోన్‌.. ఆ ఫోనులో ఫ్యామిలీ ఫొటో.. అది చూస్తూ ఎమోషన్‌ అయ్యే హీరో స్టిల్‌ చూసి, ‘ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’ అన్నారు కొందరు!

చేతిలో సెల్‌ఫోన్‌.. ఆ ఫోనులో ఫ్యామిలీ ఫొటో.. అది చూస్తూ ఎమోషన్‌ అయ్యే హీరో స్టిల్‌ చూసి, ‘ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’ అన్నారు కొందరు! హాకీ స్టిక్‌ పట్టుకుని కాలేజ్‌ గేట్‌ దగ్గర బైక్‌ మీద స్టైలిష్‌గా నిల్చున్న హీరోని చూసి, ‘ఇది పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌’ అని మరికొందరు అన్నారు. అయితే అదీ ఇదీ కాదు.. టోటల్‌గా ఇది పక్కా ఫ్యామిలీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని ‘జవాన్‌’ చిత్రబృందం అంటోంది. అలాగని లవ్‌స్టోరీ లేదనుకు నేరు. ఇందులో మంచి లవ్‌స్టోరీ ఉంది.

సాయిధరమ్‌ తేజ్, మెహరీన్‌ జంటగా బీవీయస్‌ రవి దర్శకత్వంలో కృష్ణ నిర్మిస్తున్న ‘జవాన్‌’ టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ– ‘‘మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. జూలైలో సాంగ్స్‌ షూటింగ్, ఆగస్టులో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసి, సెప్టెంబర్‌ 1న సినిమా విడుదల చేస్తాం. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు. ‘‘సాయిధరమ్‌ ఈ కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యి, మరీ చేస్తున్నాడు.

 ఈ సినిమా అనుకున్నట్టుగా బాగా వచ్చింది’’ అన్నారు చిత్ర సమర్పకుడు ‘దిల్‌’ రాజు. బీవీయస్‌ రవి మాట్లాడుతూ– ‘‘జవాన్‌’ కథ ఏంటి?, మాస్‌ కమర్షియల్‌ హీరోగా సాయిధరమ్‌ని ఎలా చూపించబోతున్నారు? అంటూ అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ అడుగు తున్నారు. మంచి కథాంశంతో తెరకెక్కుతోంది. సాయి ఇప్పటివరకూ చెయ్యని ఓ మంచి పాత్ర చేస్తున్నాడని మాత్రం చెప్పగలను’’ అన్నారు. ప్రసన్న, జయప్రకాష్, ఈశ్వరీ రావ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: తమన్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement