మధుర జ్ఞాపకాన్ని షేర్‌ చేసిన జాన్వీ | Janhvi Kapoor Shares A Throwback Picture Of Parents | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల ఫోటోను షేర్‌ చేసిన జాన్వీ కపూర్‌

Oct 12 2019 4:36 PM | Updated on Oct 12 2019 7:13 PM

Janhvi Kapoor Shares A Throwback Picture Of Parents - Sakshi

ఒకే ఒక్క సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్‌. ధడక్‌ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తన సినిమాలకు, కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటారు జాన్వీ. ఈ  క్రమంలో శనివారం జాన్వీ తన కుటుంబానికి చెందిన గడిపిన మధుర జ్ఞాపకాలను మరోసారి తన అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్‌ ఇద్దరు కలిసి ఉన్న ఒకప్పటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఈ ఫోటోలో శ్రీదేవి.. భర్త బోనీకపూర్‌ బుగ్గపై ప్రేమతో ముద్దు పెడుతూ కన్పిస్తున్నారు. కాగా వివిధ భాషల్లో నటించిన శ్రీదేవి ప్రతీ పాత్రలో ఒదిగిపోయి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. వెండితెరపై చాలాకాలం ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార... ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సినిమా సెంకడ్‌ ఇన్నింగ్‌ స్టార్ట్‌ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 2018 ఫిబ్రవరి 24న దుబాయిలోని ఓ హోటల్‌లో శ్రీదేవి అనూహ్యంగా మరణించిన విషయం తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement