ఇదే ప్రశ్న అతన్ని ఎందుకు అడగరు...? | Janhvi Kapoor Said I Dont Know Why Everyone Is Pitting Sara Ali Khan And Me | Sakshi
Sakshi News home page

ఇదే ప్రశ్న అతన్ని ఎందుకు అడగరు...?

Aug 28 2018 2:54 PM | Updated on Aug 28 2018 2:54 PM

Janhvi Kapoor Said I Dont Know Why Everyone Is Pitting Sara Ali Khan And Me - Sakshi

జాన్వి కపూర్‌ - సారా అలీ ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

తొలి చిత్రం ‘ధడక్‌’తోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌. ఇషాన్ ఖట్టర్‌, జాన్వి జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. మరోపక్క ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ కూడా సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సారా ‘కేదార్‌నాథ్‌’, ‘సింబా’ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు జాన్వి, సారా మంచి స్నేహితులు కూడా. జాన్వి తొలి చిత్రంతోనే స్టార్‌డం సంపాదించుకోవడంతో పలు మీడియా వర్గాలు ఆమెను, సారాను పోల్చి చూస్తున్నారు.

ఈ విషయంపై జాన్వి స్పందిస్తూ.. ‘నాకు, సారాకు మధ్య పోటీ ఏంటి? మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా  ఇలా పోల్చి చూడటం కొందరికి నచ్చుతుందేమో. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పుడు అర్థం వస్తుంది. ఇదే ప్రశ్నను నా సహనటుడు ఇషాన్‌ను ఎందుకు అడగరు? ప్రతిసారీ ఇద్దరు కథానాయికల మధ్యే పోటీ ఉంటుందని అంటుంటారు. కానీ అది నిజం కాదు. చెప్పాలంటే కథానాయికలు సక్సెస్‌ను కలిసే ఎంజాయ్‌ చేస్తుంటారు’ అని వెల్లడించారు జాన్వి.

అంతేకాక సారాను బిగ్‌ స్క్రీన్‌పై చూడటం కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం జాన్వి, కరణ్‌ జోహార్‌ నిర్మించనున్న ‘తఖ్త్‌’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, కరీనా కపూర్‌, ఆలియా భట్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement