ఆ సినిమాని మించి హిట్‌ అవ్వాలి | Jambalakidi Pamba Movie Team Press Meet | Sakshi
Sakshi News home page

ఆ సినిమాని మించి హిట్‌ అవ్వాలి

Jun 3 2018 1:13 AM | Updated on Jun 3 2018 1:15 AM

Jambalakidi Pamba Movie Team Press Meet - Sakshi

మురళీకృష్ణ, శ్రీనివాసరెడ్డి, సిద్ధి, అనిల్‌ రావిపూడి, ‘వెన్నెల’ కిశోర్, రవికుమార్‌ రెడ్డి, జోజో జోస్, కల్యాణ్‌ రెడ్డి∙

శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా తెరకెక్కిన చిత్రం ‘జంబలకిడి పంబ’. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్‌ నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఈవీవీ సత్యనారాయణగారి ‘జంబలకిడి పంబ’ సినిమా మనందరికీ ఇప్పటికీ గుర్తే. ఆడవాళ్లు మగవాళ్లుగా మారడం.. మగవాళ్లు ఆడవాళ్లుగా మారడం వంటివి అప్పట్లో చాలా తమాషాగా చూశాం. ఈ సినిమా అంతకన్నా పెద్ద హిట్‌ సాధించాలి’’ అన్నారు. ‘‘మనుగారు ఫస్ట్‌ వేరే కథతో వచ్చారు.

మాటల్లో ‘జంబలకిడి పంబ’ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తెరకెక్కించారు’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ‘‘ప్రమోషనల్‌ సాంగ్‌ కాన్సెప్ట్‌ కథ అనుకున్నప్పటి నుంచే ఉంది. ఒక ప్రత్యేక బడ్జెట్‌లో ఈ సాంగ్‌ని చేయాలి. గోపీసుందర్‌కి ఈ సాంగ్‌ గురించి ముందే తెలుసు. ఒక ట్యూన్‌ పంపించారు. అది తెలుసుకుని నిర్మాతలు ఖర్చుకు వెనకాడొద్దని చెప్పారు. ప్రమోషనల్‌ సాంగ్‌ క్రెడిట్‌ వాళ్లదే’’ అన్నారు మురళీకృష్ణ. సిద్ధి ఇద్నాని, గేయ రచయిత కాసర్ల శ్యామ్, నటులు ‘వెన్నెల’ కిశోర్, ‘సత్యం’ రాజేశ్, నిర్మాత రవి, సంతోష్, సురేష్‌ రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement