అలెక్స్ ఏం చేశాడు? | jai akash talks on alex movie | Sakshi
Sakshi News home page

అలెక్స్ ఏం చేశాడు?

Jul 26 2014 12:08 AM | Updated on Sep 2 2017 10:52 AM

అలెక్స్ ఏం చేశాడు?

అలెక్స్ ఏం చేశాడు?

జై ఆకాష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అదిరింది అలెక్స్’. గోల్డెన్ ఫిలింస్ సమర్పణలో రహమత్ ప్రొడక్షన్స్ పతాకంపై ఖాదర్‌వల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జై ఆకాష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అదిరింది అలెక్స్’. గోల్డెన్ ఫిలింస్ సమర్పణలో రహమత్ ప్రొడక్షన్స్ పతాకంపై ఖాదర్‌వల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను ఆకాష్ చెబుతూ -‘‘ఇందులో నేను సి.బి.సి. ఐ.డి  అలెక్స్ పాత్ర చేస్తున్నాను. అన్యాయాలను అరికట్టడానికి ఈ ఆఫీసర్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దాదాపు నెల రోజుల పాటు లండన్, ప్యారిస్‌లో ఇప్పటివరకు ఎవరూ షూటింగ్ చేయని లొకేషన్స్‌లో మొదటి షెడ్యూల్ జరిపాం.
 
వచ్చే నెల 2న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని చెప్పారు. ఖాదర్‌వల్లి మాట్లాడుతూ -‘‘జై ఆకాష్‌తో మేం నిర్మించిన ‘మిస్టర్ రాజేష్’ ఆర్థిక సంతృప్తినివ్వడంతో మళ్లీ ఆయనతో సినిమా చేస్తున్నాం. వచ్చే నెల పాటలను, సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఎమిలీ జాక్సన్ (లండన్), హాలీ జాన్సన్ (ఆస్ట్రేలియా), సెజ్జల్స్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యు.కె. మురళి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement