Hero Sharwanand 'JAANU' Movie First Look Released | శర్వానంద్ సినిమా జాను ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ - Sakshi
Sakshi News home page

జాను ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Jan 7 2020 10:43 AM | Updated on Jan 7 2020 11:21 AM

Jaanu Movie First Look Released - Sakshi

ప్రేమ సఫలమైనా, విఫలమైనా అది ఎన్నటికీ ఓ అమృత కావ్యమే. ప్రేమ ప్రధానంగా వచ్చిన తమిళ చిత్రం ‘96’ గతేడాది సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ వినూత్న ప్రేమకథను అక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. విజయ్‌ సేతుపతి, త్రిష నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. తమిళనాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో యంగ్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ సమంత జోడీ కడుతున్నారు. చిత్రయూనిట్‌ మంగళవారం ‘జాను’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో శర్వానంద్‌ ఎడారిలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. శర్వానంద్‌ను పరీక్షగా చూస్తే అతను తన జాను కోసం దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.


ప్రేమ ఆరాధకుడిగా శర్వానంద్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. కానీ సమంత అభిమానులు మాత్రం మా జాను లేదేంటి అని చిన్నబోయారు. కాగా తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ డైరెక్షన్‌ చేస్తున్నాడు. 96కు పనిచేసిన గోవింద్‌ వసంతన్‌ ‘జాను’కు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నాడు. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తవగా, త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తొలుత ‘జాను’ చిత్రాన్ని ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజు విజయ్‌దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం రిలీజ్‌ అవుతుండటంతో సినిమా యూనిట్‌ మరో తేదీని వెతికే పనిలో పడింది. చదవండి: థ్రిల్‌ చేస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement