మగవాళ్లను రక్షించండి | IPC Section Bharya Bandhu First Look Launch | Sakshi
Sakshi News home page

మగవాళ్లను రక్షించండి

May 12 2018 5:23 AM | Updated on May 12 2018 5:23 AM

IPC Section Bharya Bandhu First Look Launch - Sakshi

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని ఓ ముఖ్యమైన సెక్షన్‌ ఆధారంగా రూపొందిన కుటుంబ కథా చిత్రం ‘ఐపీసీ సెక్షన్‌.. భార్యాబంధు’. ‘సేవ్‌ మెన్‌ ఫ్రమ్‌ ఉమెన్‌’ అన్నది స్లోగన్‌. శరశ్చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా ఆమని ముఖ్య పాత్ర చేస్తున్నారు. రెట్టడి శ్రీనివాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరి క్రియేషన్స్‌ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ (గోపి), ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ ముత్యాల రాందాసు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ– ‘‘కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో సినిమా రిలీజ్‌ చేస్తాం. విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చర్చించిన అంశం గురించి మాట్లాడుకుంటారు’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్‌ ఇచ్చి, మంచి సినిమా తీసేలా ప్రోత్సహించిన సాంబశివరావుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు రెట్టడి శ్రీనివాస్‌. సంగీత దర్శకుడు విజయ్‌ కురాకుల, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.శ్యామ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement