వినూత్నమైన స్క్రిప్ట్ | Innovative script | Sakshi
Sakshi News home page

వినూత్నమైన స్క్రిప్ట్

May 16 2016 11:55 PM | Updated on Sep 4 2017 12:14 AM

వినూత్నమైన స్క్రిప్ట్

వినూత్నమైన స్క్రిప్ట్

రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఉందా.. లేదా?’. శివప్రసాద్ దర్శకత్వంలో

రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఉందా.. లేదా?’. శివప్రసాద్ దర్శకత్వంలో కమల్ ఆర్ట్స్ పతాకంపై అయితం ఎస్.కమల్ నిర్మించనున్న ఈ చిత్రం  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టారు. దర్శకుడు దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు.

‘‘ఇప్పటి వరకు సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో చాలా సినిమాలొచ్చినా, ఇదొక కొత్త వెర్షన్‌లో రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రమిది. మంచి ప్రేమకథ ఉంటుంది’’ అని దర్శకుడు శివ ప్రసాద్ పేర్కొన్నారు. ‘‘డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. కథ నచ్చడంతో నిర్మించేందుకు ముందుకొచ్చా. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది’’ అని నిర్మాత కమల్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రవీణ్ కె.బంగారి.

Advertisement
 
Advertisement
Advertisement