రొమాంటిక్ స్వరాలు..! | ilayaraja still continuing good music | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ స్వరాలు..!

Mar 29 2014 12:09 AM | Updated on Sep 2 2017 5:18 AM

రొమాంటిక్ స్వరాలు..!

రొమాంటిక్ స్వరాలు..!

ఇళయరాజాకు ట్రెండ్‌తో పనిలేదు. నవతరంతో పోటీ పడుతూ... ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ ఇస్తూనే ఉన్నారాయన. గత ఏడాది ‘గుండెల్లో గోదారి’తో సంగీతాభిమానుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన మేస్ట్రో...

ఇళయరాజాకు ట్రెండ్‌తో పనిలేదు.  నవతరంతో పోటీ పడుతూ... ఇప్పటికీ మ్యూజికల్ హిట్స్ ఇస్తూనే ఉన్నారాయన. గత ఏడాది ‘గుండెల్లో గోదారి’తో సంగీతాభిమానుల హృదయాల్లో ఆనందాన్ని నింపిన మేస్ట్రో... మళ్లీ ఓ తెలుగు సినిమాకు తన స్వరాలతో సొగబులద్దుతున్నారు. ఆ సినిమానే.. ‘వస్తా నీ వెనుక’. రమేశ్‌వర్మ దర్శకత్వంలో హవీష్, అమలాపాల్, ఇష జంటగా దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయింది.

 దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం సమపాళ్లలో రంగరించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. దానికి తగ్గట్టే అద్భుతమైన ఆరు పాటలను ఇళయరాజా అందించారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఏప్రిల్ 4 నుంచి 55 రోజుల పాటు యూరప్‌లో భారీ షెడ్యూల్ చేయనున్నాం. టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా అక్కడే చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. హవీష్, అమలాపాల్, ఇష పాత్రలు యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంటాయని, శ్రోతల్ని అలరించేలా ఇళయరాజా స్వరాలుంటాయని రమేష్‌వర్మ చెప్పారు. ఈ చిత్రానికి రచన: విస్సు, కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement