హీరోయిన్ తండ్రిగా కూడా నటిస్తాను - రాజా రవీంద్ర | iam ready to act as heroine father : raja ravindra | Sakshi
Sakshi News home page

హీరోయిన్ తండ్రిగా కూడా నటిస్తాను - రాజా రవీంద్ర

Feb 19 2014 11:17 PM | Updated on Sep 2 2017 3:52 AM

హీరోయిన్ తండ్రిగా కూడా నటిస్తాను  - రాజా రవీంద్ర

హీరోయిన్ తండ్రిగా కూడా నటిస్తాను - రాజా రవీంద్ర

‘‘హీరోగా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత కీలకమైన పాత్రలు చేశాను. మధ్యలో కొంత విరామం వచ్చినా, ఇకపై, పూర్తి స్థాయిలో నటనకు అంకితం అవుతాను’’ అని రాజా రవీంద్ర చెప్పారు.

 ‘‘హీరోగా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత కీలకమైన పాత్రలు చేశాను. మధ్యలో కొంత విరామం వచ్చినా, ఇకపై, పూర్తి స్థాయిలో నటనకు అంకితం అవుతాను’’ అని రాజా రవీంద్ర చెప్పారు. ఇటీవల విడుదలైన ‘పైసా’లోని తన పాత్రకు చాలా ప్రశంసలు దక్కాయని ఆయన ఆనందం వెలిబుచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో రాజా రవీంద్ర విలేకర్లతో ముచ్చటిస్తూ ‘‘ఆ మధ్య కొన్ని ప్రొడక్షన్ వ్యవహారాలు, నటీనటుల కాల్‌షీట్లు చూశాను. దాంతో నేను నటించనేమోనని చాలామంది అనుకున్నారు.
 
 మంచి ప్రాతల కోసం ఎదురుచూస్తూ అలా చేశానే తప్ప, పూర్తిగా నటనకు దూరమయ్యే ఉద్దేశమే లేదు. యువ కథానాయకుల సినిమాల్లో అన్న పాత్రలు, హీరోయిన్ తండ్రి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విలన్‌గానూ నటించాలని ఉంది’’ అని తెలిపారు. ‘‘నేను ఇంతకు ముందు బుల్లితెరపై నటించాను. భవిష్యత్తులో రియాల్టీ షోలు నిర్మించాలనే ఆలోచన కూడా ఉంది’’ అని ఆయన వెల్లడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement