నిద్రలేని రాత్రులు గడిపా: మెగాస్టార్ | I still get sleepless nights before a shot: Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

నిద్రలేని రాత్రులు గడిపా: మెగాస్టార్

Sep 15 2016 5:56 PM | Updated on Apr 3 2019 6:34 PM

నిద్రలేని రాత్రులు గడిపా: మెగాస్టార్ - Sakshi

నిద్రలేని రాత్రులు గడిపా: మెగాస్టార్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు నటుడిగా 40 ఏళ్లకుపైగా అనుభవముంది.

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు నటుడిగా 40 ఏళ్లకుపైగా అనుభవముంది. ఆయన ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 73 ఏళ్ల వయసులోనూ సత్తాచాటుతున్నారు. కోట్లాది అభిమానులకు ఆరాధ్యుడైన అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఓ పరీక్షని, తనకు ఓ పరీక్ష (ఎగ్జామ్) వంటిదని, పింక్ షూటింగ్ సమయంలో ప్రతిషాట్లో నటించే ముందు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. ఓ షాట్లో నటించే ముందు 40 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడూ ఆత్రుతతో ఎదురుచూస్తానని అన్నారు. జీవితంలో సులభంగా ఏదీ రాదని చెప్పారు.

పింక్ సినిమాలో అమితాబ్ లాయర్ పాత్రలో నటించారు. షూజిత్ సిర్కర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అగ్రహీరోగా వెలుగొంది, క్యారెక్టర్ స్టార్గా మారడం ఇబ్బందిగా అనిపించిందా అన్న మీడియా ప్రశ్నకు.. ఆ దిశగా ఆలోచించలేదని అమితాబ్ చెప్పారు. నటించడం తనకు ఇష్టమని, అదృష్టవశాత్తూ ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయని, క్యారెక్టర్ పాత్రలోనైనా లేదా ఇతర పాత్రలోనైనా నటిస్తానని అన్నారు. పింక్‌ సినిమాలో అమితాబ్తో పాటు తాప్సీ, కృతీ కుల్హరి, ఆండ్రియా, అంగాద్ బేడీ తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement