ఆ తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది | i did two blunders in my career : shreya saran | Sakshi
Sakshi News home page

ఆ తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది

Dec 30 2013 12:37 AM | Updated on Apr 3 2019 6:23 PM

శ్రీయ - Sakshi

శ్రీయ

కెరీర్ విషయంలో నేను రెండు బ్లండర్స్ చేశాను. తొందరపాటు వల్ల చేసిన తప్పిదాలవి. వాటి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా’’

‘‘కెరీర్ విషయంలో నేను రెండు బ్లండర్స్ చేశాను. తొందరపాటు వల్ల చేసిన తప్పిదాలవి. వాటి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా’’ అంటూ ఓ నిట్టూర్పును విడిచారు అందాలభామ శ్రీయ. కెరీర్ దాదాపు చరమాంకానికి చేరుకోవడంతో ఓ విధమైన నిర్వేదానికి గురయ్యారామె. ఇటీవల ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవానికి విశాఖ చేరుకున్న శ్రీయ.. మీడియాతో ముచ్చటించారు. ‘‘కెరీర్ మంచి పీక్‌లో ఉన్న టైమ్‌లో నేను చేసిన పెద్ద తప్పు ఐటమ్‌సాంగ్ చేయడం. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లందరూ ఐటమ్ నంబర్స్ చేస్తున్నారు. పైగా ఆ ఒక్కపాట వారి కెరీర్‌కి ఎంతో హైట్స్‌కి తీసుకెళ్తోంది. 
 
 ఆ ట్రెండ్‌ని మనమెందుకు ఇక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో ‘మున్నా’లో ఐటమ్‌సాంగ్ చేశాను. ఏ ముహూర్తాన ఆ పాట చేశానో... వరుసగా ఐటమ్‌సాంగులే రావడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా... అవి నా కెరీర్‌కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అలాగే... ‘కాల్‌గాళ్’ పాత్ర చేస్తే... కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని ఆశించాను. బాలీవుడ్‌లో ఈ ఫీట్ చేసిన హీరోయిన్లందరూ మంచి హిట్స్ అందుకున్నారు. అలాగే... నాక్కూడా ఆ పాత్ర హిట్ ఇస్తుందని ఆశించి ‘పవిత్ర’ చేశాను. ఆ సినిమా నా కెరీర్‌పై ఏర్పడిన గాయాన్ని మరింత పెంచింది. ఈ రెండు తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది’’ అని గత స్మృతుల్ని నెమరువేసుకున్నారు శ్రీయ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement