అప్పుడే ఆయనతో నటించడం లక్కీనే.. | I consider myself extremely lucky to be working with Nagarjuna: Gabriella Demetriades | Sakshi
Sakshi News home page

అప్పుడే ఆయనతో నటించడం లక్కీనే..

Aug 26 2015 10:12 AM | Updated on Jul 15 2019 9:21 PM

అప్పుడే ఆయనతో నటించడం లక్కీనే.. - Sakshi

అప్పుడే ఆయనతో నటించడం లక్కీనే..

తాను సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమే అని అంటోంది ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, నటి గాబ్రియెల్లా దిమిత్రిడేస్

చెన్నై: తాను సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమే అని అంటోంది ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, నటి గాబ్రియెల్లా దిమిత్రిడేస్. గతంలో సోనాలి కేబుల్ అనే హిందీ చిత్రంలో నటించిన ఆమె ఇప్పుడు తాజాగా నాగార్జున సరసన హీరయిన్గా నటిస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు కార్తీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో మరో హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి గాబ్రియెల్ తన అనుభవాలు తెలియజేస్తూ 'ఇది నాజీవితానికి ఒక కల. కెరీర్ ప్రారంభంలోనే నాగార్జునలాంటి హీరోతో పనిచేసే అవకాశం రావడం నాకు నేను చాలా అదృష్టం అని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఇంతకుమించి సినిమా వివరాలు తెలియజేయలేను' అని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement