కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్ | I am bored of comedies: Riteish Deshmukh | Sakshi
Sakshi News home page

కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్

Jun 18 2014 3:36 PM | Updated on Sep 2 2017 9:00 AM

కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్

కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్

కామెడీ క్యారెక్టర్లు చేసి బోర్ కొట్టిందని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ పేర్కొన్నాడు.

న్యూఢిల్లీ: కామెడీ క్యారెక్టర్లు చేసి బోర్ కొట్టిందని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల రితేష్.. హౌస్ఫుల్, గ్రాండ్ మస్తీ సినిమాల్లో హాస్యాపాత్రల్లో అలరించాడు. మంచి టైమింగ్ తో కామెడీ పండించి పలు అవార్డులు కూడా అందుకున్నాడు.

హాస్యపాత్రలు చేసి విసుగొచ్చిందని రితేష్ అన్నాడు. కొత్తగా ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. ప్రేక్షకులు తనను కామెడీ పాత్రల్లో చూడడానికే ఇష్ట పడుతున్నారని తెలిపాడు. నాచ్, రన్ సినిమాల్లో విభిన్న పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరించలేదని వాపోయాడు. త్వరలో విడుదలకానున్న సాజిద్ ఖాన్ సినిమా 'హమ్షాకాల్స్'లో రితేష్ నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement