breaking news
Comic Roles
-
కామిక్ కాన్‌దాన్..
అక్కడకు చేరిన వాళ్లందరి ఖాన్దాన్ ఒకటే.. అదే ‘కామిక్ కాన్’దాన్. కామిక్స్ అభిమానులంతా తమ అభిమాన కామిక్ పాత్రల వేషధారణలో వచ్చి సందడి చేశారు. ప్రపంచంలోని కామిక్ పాత్రలన్నీ ఒకేచోటికి రావడంతో సందర్శకులు ఆనంద పరవశులయ్యారు. హైటెక్స్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘కామిక్ కాన్’కి నగర వాసుల నుంచి స్పందన లభించింది. మూడు రోజులు జరగనున్న ఈ కార్యక్రవుంలో రోజూ ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. కామిక్ బుక్/గ్రాఫిక్ నావెల్, ఏనిమేటెడ్ సిరీస్/మూవీ, మాంగా/ఏనిమీ, స్కై-ఫై/ఫాంటసీ, గేమింగ్ విభాగాల్లో నిర్వహించే పోటీల్లో ఒక్కో విభాగం నుంచి ఒక్కో విజేతను రోజూ ఎంపిక చేస్తారు. ఈ విజేతల నుంచి లక్కీ డ్రాలో ఎంపికైన లక్కీ విజేతకు వచ్చే ఏడాది షికాగోలో జరిగే కామిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశమిస్తారు. అంతర్జాతీయ కామిక్స్ ప్రత్యేకం.. కామిక్ కాన్‌లో అంతర్జాతీయ కామిక్ సంస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జపాన్‌కు చెందిన ఐఐఎన్ఈ టాయ్స్ సంస్థ ఏనిమీ అండ్ మాంగా మెర్చ్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ఐడీడబ్ల్యూ, ఓని ప్రెస్, ఇమేజ్ కామిక్స్ వంటివి ప్రపంచం నలు మూలలకు చెందిన కామిక్ పుస్తకాలను తీసుకొచ్చాయి. టాంకీ టాయ్స్, ఐఐఎన్ఈ టాయ్స్ వం టి సంస్థలు కామిక్ బొమ్మలు, టీషర్టులు, గ్లాసులు, కప్పులతో ప్రదర్శనలు పెట్టాయి. తొలిరోజు..స్యెనగరి స్టూడియోస్ ప్రదర్శించిన ‘ది రోబోస్ ఆఫ్ ధర్మ’, రాహుల్ ఫిలిప్ ప్రదర్శించిన ‘లైవ్ కాన్సెప్ట్ ఆర్ట్’ డెవూన్స్ట్రేషన్ ఆకట్టుకున్నాయి. రాన్ వూర్జ్, నాథన్ ఎడ్మండ్సన్, జేక్ ఎల్లిస్, వివేక్ తివారీ వంటి అంతర్జాతీయు కామిక్ రచయితలు, చిత్రకారులు పాల్గొన్నారు. అద్భుతమైన స్పందన.. హైదరాబాద్ కామిక్ కాన్ తొలి ఎడిషన్ కార్యక్రమం కోసం నిజాంల నగరానికి రావడం ఆనందంగా ఉంది. హైదరాబాదీల ప్రేవూభిమానాలు, వారి నుంచి మాకు లభిస్తున్న ఆదరణ అపూర్వం. -జతిన్ వర్మ, వ్యవస్థాపకుడు, కామిక్ కాన్ ఇండియా - సిద్ధాంతి -
కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్
న్యూఢిల్లీ: కామెడీ క్యారెక్టర్లు చేసి బోర్ కొట్టిందని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల రితేష్.. హౌస్‌ఫుల్, గ్రాండ్ మస్తీ సినిమాల్లో హాస్యాపాత్రల్లో అలరించాడు. మంచి టైమింగ్ తో కామెడీ పండించి పలు అవార్డులు కూడా అందుకున్నాడు. హాస్యపాత్రలు చేసి విసుగొచ్చిందని రితేష్ అన్నాడు. కొత్తగా ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. ప్రేక్షకులు తనను కామెడీ పాత్రల్లో చూడడానికే ఇష్ట పడుతున్నారని తెలిపాడు. నాచ్, రన్ సినిమాల్లో విభిన్న పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరించలేదని వాపోయాడు. త్వరలో విడుదలకానున్న సాజిద్ ఖాన్ సినిమా 'హమ్షాకాల్స్'లో రితేష్ నటించాడు.