బాలీవుడ్ నుంచి మరో అడల్ట్ కామెడీ సినిమా మస్తీ-4 రానుంది. మస్తీ (Masti) ఫ్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించాయి. ఈ సీరిస్ నుంచి రానున్న మస్తీ-4 చిత్రంలో హీరోలు రితేశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. మిలాప్ మిలన్ జావేరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శ్రేయ శర్మ, రూహి సింగ్, ఎల్నాజ్ నోరౌజి తదితరులు నటించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
