breaking news
Masti
-
బాలీవుడ్ సినిమా.. ట్రైలరే ఇలా ఉంటే..?
బాలీవుడ్ నుంచి మరో అడల్ట్ కామెడీ సినిమా మస్తీ-4 రానుంది. మస్తీ (Masti) ఫ్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించాయి. ఈ సీరిస్ నుంచి రానున్న మస్తీ-4 చిత్రంలో హీరోలు రితేశ్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. మిలాప్ మిలన్ జావేరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శ్రేయ శర్మ, రూహి సింగ్, ఎల్నాజ్ నోరౌజి తదితరులు నటించారు. -
మళ్లీ హిజ్రాగా ...
హైదరాబాద్ : హిజ్రాగా మళ్లీ తెర మీద కనిపించబోతున్నట్లు ప్రముఖ నటుడు మురళీ శర్మ ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. మస్తీ చిత్రంలో హిజ్రా పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల క్రితం దీపక్ తిజోరీ దర్శకత్వంలో వచ్చిన ఓ సీరియల్లో ఇలాంటి పాత్ర చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పాత్ర మంచి హిట్ అయిందని... అలాంటి పాత్రలో నటించేందుకు చాలా అవకాశాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ తరహా పాత్రలో నటించ కూడదని అప్పుడు అనుకున్నానని మురళి చెప్పారు. కానీ మస్తీలో మళ్లీ అలాంటి పాత్రలో నటించే అవకాశం తనకు వచ్చిందన్నారు. హిజ్రాల కట్టుబోట్టు... వాళ్ల నడవడికతో కొన్ని సీన్లు ఇప్పటికే పూర్తయినవని మురళీ చెప్పారు. ఆసక్తి కలిగిన పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని మురళీ స్పష్టం చేశారు. మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి.... రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురు చిత్రాలతోపాటు పలు చిత్రాలలో మురళీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


