మళ్లీ హిజ్రాగా ... | Murli Sharma to play a eunuch again | Sakshi
Sakshi News home page

మళ్లీ హిజ్రాగా ...

Aug 16 2015 10:03 AM | Updated on Sep 3 2017 7:33 AM

మళ్లీ హిజ్రాగా ...

మళ్లీ హిజ్రాగా ...

హిజ్రాగా మళ్లీ తెర మీద కనిపించబోతున్నట్లు ప్రముఖ నటుడు మురళీ శర్మ ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు.

హైదరాబాద్ : హిజ్రాగా మళ్లీ తెర మీద కనిపించబోతున్నట్లు ప్రముఖ నటుడు మురళీ శర్మ ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. మస్తీ చిత్రంలో హిజ్రా పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 15  ఏళ్ల క్రితం దీపక్ తిజోరీ దర్శకత్వంలో వచ్చిన ఓ సీరియల్లో ఇలాంటి పాత్ర చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పాత్ర మంచి హిట్ అయిందని... అలాంటి పాత్రలో నటించేందుకు చాలా అవకాశాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

కానీ ఆ తరహా పాత్రలో నటించ కూడదని అప్పుడు అనుకున్నానని మురళి చెప్పారు. కానీ మస్తీలో మళ్లీ అలాంటి పాత్రలో నటించే అవకాశం తనకు వచ్చిందన్నారు.  హిజ్రాల కట్టుబోట్టు... వాళ్ల నడవడికతో కొన్ని సీన్లు ఇప్పటికే పూర్తయినవని మురళీ చెప్పారు. ఆసక్తి కలిగిన పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని మురళీ స్పష్టం చేశారు. మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి.... రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురు చిత్రాలతోపాటు పలు చిత్రాలలో మురళీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement