టాలీవుడ్ న‌టుడి ఇంట విషాదం | Murli Sharma Mother Padma Sharma Last Breath At 76 | Sakshi
Sakshi News home page

ముర‌ళీ శ‌ర్మకు మాతృవియోగం

Jun 8 2020 8:56 PM | Updated on Jun 8 2020 9:26 PM

Murli Sharma Mother Padma Sharma Last Breath At 76 - Sakshi

ముంబై: టాలీవుడ్ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న మాతృమూర్తి ప‌ద్మ శ‌ర్మ(76) ఆది‌వారం రాత్రి ముంబైలోని త‌న స్వగృహంలో మ‌ర‌ణించారు. అనారోగ్య కార‌ణాల‌తో ఆమె క‌న్నుమూసిన‌ట్లు తెలుస్తోంది. కాగా ముర‌ళీ శ‌ర్మ తండ్రి వృజభూషణ్(84) గ‌తేడాది మ‌ర‌ణించారు. ముర‌శీ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. "దిల్ వాల్ ప్యార్ ప్యార్" సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేశాడు. షారుఖ్ ఖాన్‌తో క‌లిసి 'మై హూ నా', స‌ల్మాన్ ఖాన్ 'ద‌బాంగ్'‌ వంటి ప‌లు హిట్ సినిమాల్లో న‌టించాడు. ఇటీవ‌ల‌ వ‌రుణ్ ధావ‌న్ స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డి చిత్రంలోనూ ఆయ‌న న‌టించాడు.‌ విల‌న్‌, క‌మెడియ‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్ర‌లు పోషిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు తెలుగులోనూ సాహో, అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రు, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ వంటి హిట్ సినిమాల్లో కనిపించాడు. (నా శరీరం బాగుంది.. అందుకే: నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement