బాలీవుడ్ హీరోతో 550 కోట్ల డీల్ | Hrithik Roshan inks deal worth Rs. 550 crores for satellite rights | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోతో 550 కోట్ల డీల్

Jul 13 2016 10:27 AM | Updated on Sep 4 2017 4:47 AM

బాలీవుడ్ హీరోతో 550 కోట్ల డీల్

బాలీవుడ్ హీరోతో 550 కోట్ల డీల్

త్వరలో మొహెంజోదారో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న హృతిక్ రోషన్, మరో రికార్డ్ నెలకొల్పాడు.

త్వరలో మొహెంజోదారో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న హృతిక్ రోషన్, మరో రికార్డ్ నెలకొల్పాడు. గతంలో మరే హీరో చేయని విధంగా స్టార్ నెట్వర్క్తో భారీ డీల్కు అంగీకరించాడు. రాబోయే హృతిక్ సినిమాల కోసం స్టార్ టివి ఏకంగా 550 కోట్ల మొత్తానికి హృతిక్ రోషన్తో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హృతిక్ తన రాబోయే ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆ టివి చానల్కే ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. కాగా బాలీవుడ్ చరిత్రలోనే ఇదే బిగెస్ట్ డీల్ అంటున్నారు విశ్లేషకులు. జిందగీ నా మిలేంగే దుబారా, అగ్రిపథ్, క్రిష్ 3, బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో పాటు.., ఆ సినిమాల శాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తాలకు అమ్ముడు పోవటంతో స్టార్ టివి ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement