విజువల్ వండర్గా 'ఏంజెల్'

విజువల్ వండర్గా 'ఏంజెల్'


ప్రముఖ నిర్మాత కృష్ణరెడ్డి తనయుడు భువన్ సాగర్ తొలిసారిగా నిర్మాతగా మారి, బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఏంజెల్. సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మాణ పర్వవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా అలరించనుంది.ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. షియాజీ షిండే, ప్రదీప్ రావత్, సప్తగిరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top