వామ్మో దెయ్యం! | heroine trisha act to devil role | Sakshi
Sakshi News home page

వామ్మో దెయ్యం!

Feb 9 2017 11:38 PM | Updated on Sep 5 2017 3:18 AM

వామ్మో దెయ్యం!

వామ్మో దెయ్యం!

పాపం.. త్రిష. ఓ దెయ్యం ఈ బ్యూటీని టార్చర్‌ పెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ కాదు..

పాపం.. త్రిష. ఓ దెయ్యం ఈ బ్యూటీని టార్చర్‌ పెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ కాదు.. లండన్‌లో. షెఫ్‌గా చేయడానికి త్రిష లండన్‌ వెళుతుంది. అక్కడ ఓ దెయ్యం ఆమెను వెంటాడడం మొదలు పెడుతుంది. ఆ దెయ్యం పెట్టే టార్చర్‌ తట్టుకోలేక తెగ బాధపడుతుంది. త్రిషను వెంటాడి బాధపెట్టడంలో ఆ దెయ్యం ఆనందం పొందుతుంటుంది.

చివరికి ఆ దెయ్యాన్ని త్రిష ఎలా వదిలించుకుందో తెలియాలంటేæతెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘మోహిని’ చూడాల్సిందే. ఇప్పటివరకూ చెప్పిందంతా ‘మోహిని’ కథా కమామీషు. ఇందులో మనిషిగా, దెయ్యంగా రెండు పాత్రలనూ త్రిష చేశారు. త్రిష వర్సెస్‌ త్రిష సీన్స్‌ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయని దర్శకుడు మాదేశ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement