మీ ప్రేమపై ఒట్టేసి చెబుతున్నా! – హీరో నాని | hero nani 'ninnu kori' pre-release function | Sakshi
Sakshi News home page

మీ ప్రేమపై ఒట్టేసి చెబుతున్నా! – హీరో నాని

Jun 30 2017 11:44 PM | Updated on Sep 5 2017 2:52 PM

మీ ప్రేమపై ఒట్టేసి చెబుతున్నా! – హీరో నాని

మీ ప్రేమపై ఒట్టేసి చెబుతున్నా! – హీరో నాని

‘‘కొన్ని సినిమాలను చూసిన తర్వాత వాటిని వదిలేసి ఇంటికెళ్లిపోతాం.

‘‘కొన్ని సినిమాలను చూసిన తర్వాత వాటిని వదిలేసి ఇంటికెళ్లిపోతాం. కొన్నింటిని ఇంటిదాకా తీసుకెళ తాం. మీ (ప్రేక్షకులు, అభిమానులు) ప్రేమపై ఒట్టేసి చెబుతున్నా. ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకునే చిత్రమిది’’ అన్నారు హీరో నాని. ఆయన నటించిన ‘నిన్ను కోరి’ ప్రీ–రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానుంది.

రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ట్రైలర్‌ మళ్లీ మళ్లీ చూశాను. నిర్మాణ విలువలు బాగున్నాయి. శివ ట్రైలర్‌ను బాగా కట్‌ చేశారు. నాని కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరిగాయి’’ అన్నారు.‘‘జీఎస్టీ వచ్చాక రిలీజవుతోన్న తొలి తెలుగు చిత్రమిది. జీఎస్టీ వల్ల సినిమాకు ఎంత మేలు జరుగుతుందనే దానిపై చర్చలు జరుగుతున్నా యి. ఈ సినిమాను మావాళ్లే కొన్నారు. బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత డి.సురేశ్‌బాబు.

Advertisement
 
Advertisement
Advertisement