పైరసీ చేసేది నేనే!

Hero Heroine Movie Teaser Launch - Sakshi

‘మీ హీరోల సినిమాలన్నీ పైరసీ చేసేది నేనే..’ అంటూ హీరో నవీన్‌ చంద్ర డైలాగ్‌తో ‘హీరో హీరోయిన్‌’ టీజర్‌ విడుదలైంది. ‘ప్రొడ్యూసర్‌ కూతురైతే ఏంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అనే మరో డైలాగ్‌ కూడా ఆకట్టుకుంటోంది. టీజర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పైరసీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. నవీన్‌ చంద్ర హీరోగా, గాయత్రి సురేశ్, పూజా ఝవేరి హీరోయిన్లుగా ‘అడ్డా’ ఫేమ్‌ జి.యస్‌. కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హీరో హీరోయిన్‌’. ‘ఎ పైరేటెడ్‌ లవ్‌ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. స్వాతి పిక్చర్స్‌ పతాకంపై భార్గవ్‌ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ జనార్థన్, వీడియోగ్రాఫర్‌ పొన్నం శ్రీనివాస్‌ విడుదల చేశారు. కార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘పైరసీ నేపథ్యంలో సాగే చిత్రమిది.

ఇండస్ట్రీలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపించే కుర్రాడిగా నవీన్‌ చంద్ర నటించారు. హీరోలకు, నిర్మాతలకు త్వరలోనే ఓ ప్రత్యేక షో వేస్తాం. దీనికి తమిళ పరిశ్రమ నుంచి విశాల్‌ కూడా వస్తున్నారు. ఇండస్ట్రీలోని హీరోల బైట్‌లతో రోలింగ్‌ వేయబోతున్నాం’’ అన్నారు. ‘‘తమ సినిమాలు పైరసీ అవుతాయని తెలిసినా లెక్క చేయకుండా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు హ్యాట్సాఫ్‌’’ అని నవీన్‌ చంద్ర అన్నారు. ‘‘మంచి మెసేజ్‌తో రూపొందుతోన్న ‘హీరో హీరోయిన్‌’ సినిమా మంచి హిట్‌ అవ్వాలి’’ అని ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు బి.ఎ.రాజు, సురేష్‌ కొండేటి అన్నారు. ‘‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని భార్గవ్‌ మన్నె అన్నారు. గాయత్రి సురేశ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: వెంకట్‌ గంగాధరీ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top