సంక్రాంతి బరిలో పద్మావతి | Here’s when the makers may announce release date | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరిలో పద్మావతి

Dec 6 2017 10:04 AM | Updated on Aug 21 2018 2:39 PM

Here’s when the makers may announce release date - Sakshi

సాక్షి,ముంబయి: వివాదాలు చుట్టుముట్టి వాయిదా పడిన సంజయ్‌ లీలా భన్సాలి చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి విడుదలపై త్వరలో స్పష్టత రానుంది. దీపికా పదుకోన్‌, రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌లు నటించిన పద్మావతి డిసెంబర్‌ 1న విడుదల కావాల్సి ఉండగా నిరసనకారుల ఆందోళనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మూవీపై నిషేధం విధించడంతో సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

అయితే జనవరి మొదటి వారం లేదా రెండోవారంలో పద్మావతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.ఈలోగా సీబీఎఫ్‌సీ స్పందన వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎన్నికలు పూర్తయి, సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్‌ రాగానే ప్రపంచవ్యాప్తంగా పద్మావతిని అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.జనవరి మొదటి, రెండవ వారంలో భారీ సినిమాలు లేకపోవడంతో ఆ వ్యవధిలో పద్మావతిని థియేటర్లలోకి దింపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement