నా మనసు దోచేశావ్‌ అని ఆ అమ్మాయి మెసేజ్‌ చేసింది

Hello Movie Sucess Meet - Sakshi

‘‘ మాస్, క్లాస్‌ అని కాదు. కథ బాగుండాలి. నాకు నచ్చాలి. స్క్రిప్ట్‌లోని నా క్యారెక్టర్‌ ప్రేక్షకులు మెచ్చుకుంటారని నాకు అనిపిస్తే తప్పకుండా సినిమా చేస్తాను. మంచి సినిమాలో భాగం కావడానికి  ఎప్పుడూ రెడీగానే ఉంటా. ముందు మాస్, ఆ తర్వాత క్లాస్, మళ్లీ మాస్‌... ఇలా లెక్కలు వేసుకుని సినిమాలు చేయాలన్న మైండ్‌సెట్‌ ప్రజెంట్‌ నాకు లేదు. నేనేం మిస్టేక్‌ చేశానో తెలుసుకోవడానికి నా ఫస్ట్‌ మూవీ ‘అఖిల్‌’ని 30 సార్లు చూశా’’ అన్నారు అఖిల్‌. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘హలో’. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయులు సమావేశంలో హీరో అఖిల్‌ చెప్పిన విశేషాలు...

► యాక్టర్‌గా ఇంప్రూవ్‌ అయ్యానని నాతోటి యాక్టర్స్‌ అన్నారు. ‘సెటిల్డ్‌ ఫెర్మార్మెన్స్‌’ అని చిరంజీవిగారు అన్నారు. చిరంజీవిగారు నా లక్కీ చార్మ్‌. ఆయన ఒక ఫాదర్‌లా గైడ్‌ చేస్తారు. చరణ్‌తో కూడా నేను క్లోజ్‌గా ఉంటాను. నన్నే కాదు యాక్టర్స్‌ అందర్నీ చిరంజీవిగారు ప్రోత్సహిస్తారు. ఆయనకు సినిమాల మీద ఉన్న ప్యాషన్‌ అలాంటిది. డైరెక్టర్‌ ప్రియదర్శన్‌గారు నాన్నగారికి ఫోన్‌ చేసి అభినందిచారు.

► నాన్నగారు చాలా స్ట్రాంగ్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమాకి ఫాదర్‌ ఆయన. రామ్‌గోపాల్‌ వర్మ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ని క్యాన్సిల్‌ చేసి మరీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చూసుకున్నారు నాన్నగారు. అలాంటి ప్రొడ్యూసర్‌ దొరకడం నాకు లక్కీ. టెన్షన్‌ అంతా నాన్నగారే తీసుకున్నారు. నాన్నగారు ‘హలో’ సినిమాను 20 సార్లు చూశారు. దాంతో నాన్నగారికి సినిమాపై జడ్జ్‌మెంట్‌ పోయింది. ఫస్ట్‌టైమ్‌ ఎడిట్‌ రూమ్‌లో సెకండాఫ్, క్లైమాక్స్‌ చూసి హ్యాపీ ఫీలయ్యారు. యాక్టర్‌గా ఇంప్రూవ్‌ అయ్యావని నాన్నగారు మెచ్చుకున్నారు. హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ సాయంతోనే పాట పాడగలిగాను. ‘అఖిల్‌’ సినిమాను నాన్నగారు సెలక్ట్‌ చేయలేదు. నేనే ఎంచుకున్నాను.

► సినిమా స్టార్ట్‌ చేసినప్పుడే సీజీ వర్క్‌ ఎక్కువగా వద్దనుకున్నాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగా రావడానికి నేను ఒక్కడినే కారణం కాదు. 15 మెంబర్స్‌ టీమ్‌ వర్క్‌ ఉంది. అయితే ట్రైనింగ్‌ కోసం కష్టపడ్డాను. సేఫ్టీ ప్రికాషన్స్‌ తీసుకున్నాం. విక్రమ్‌గారు బాగా తీశారు. రమ్యకృష్ణగారితో నటించడం హ్యాపీగా ఫీలవుతున్నాను. హీరోయిన్‌ కల్యాణీ బాగా చేసింది. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో నేను ఇన్‌వాల్వ్‌ కాలేదు. కానీ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌లో కొంచెం ఇన్‌వాల్వ్‌ అయ్యాను.

► క్లైమాక్స్‌ సీన్‌కు సంబంధించి ఒక అమ్మాయి ‘యు స్టోల్‌ మై హార్ట్‌’ అని మేసేజ్‌ చేసింది. అదే బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా ఫీల్‌ అవుతున్నాను. స్క్రిప్ట్‌ పరంగా డ్యాన్స్‌కు పెద్ద స్కోప్‌ లేదు. కథను నమ్మాను. సో.. సినిమాలో చైల్డ్‌ ఎపిసోడ్‌ లెంగ్త్‌ ఎక్కువ అనిపించలేదు. శ్రీను (అఖిల్‌ పాత్ర పేరు), జున్ను (కల్యాణి పాత్ర పేరు) చిన్నప్పటి క్యారెక్టర్లు చేసిన పిల్లలు బాగా నటించారు.

► జనరల్‌గా నాకు టెన్షన్‌ ఎక్కువ. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అసలు నిద్రపోలేదు. మార్నింగ్‌ 8 వరకూ వెయిట్‌ చేసి యూఎస్‌ ఫస్ట్‌ రివ్యూ విన్న తర్వాత ఆనందపడ్డాను. ఆ తర్వాత హాయిగా నిద్రపోయాను. సినిమా రివ్యూల్లో 3రేటింగ్‌ ఇచ్చారు. హ్యాపీ ఫీలయ్యాను. హిట్‌ సాధించాను. కలెక్షన్స్‌ గురించి మాట్లాడటంలేదు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. బాక్సాఫీస్‌ వద్ద సోలోగా వస్తే బాగుండు అనిపించింది. కానీ రెండు సినిమాలను తీసుకోగల మార్కెట్‌ తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందనుకుంటున్నాను.

► ఈ సినిమా చేస్తున్నప్పుడు యాక్టింగ్‌ వైజ్‌గానే కాదు. ఫిల్మ్‌ మేకింగ్‌ పరంగా కొత్త విషయాలను నేర్చుకున్నాను. మా నాన్నగారు, పీఎస్‌ వినోద్, కె.విక్రమ్‌కుమార్‌ లాంటి డెడికేషన్‌ ఉన్నవారితో వర్క్‌ చేసాను. ఆ అనుభవం నాకు హెల్ప్‌ అవుతుంది.

► ఈ సినిమా సక్సెస్‌ తర్వాత గ్యాప్‌ తీసుకోవాలనుకోవ డం లేదు. హాలిడేస్‌ వద్దు. జనవరిలో కొత్త సినిమాను అనౌన్స్‌ చేసి, ఫిబ్రవరిలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నా నెక్ట్స్‌ సినిమా ఇంకా ఫిక్స్‌ కాలేదు. జనవరి 10లోపు అనౌన్స్‌ చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లిని కలిశాను. కొరటాల శివగారితో లంచ్‌ చేశాను. ఇలా కలిసిన అందరి డైరెక్టర్స్‌తో సినిమాలు చేయలేం. సుకుమార్‌గారితో చేయాలని ఉంది. కథ కుదరాలి. బాలీవుడ్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో చేయాలని ఉంది. హిందీ, తెలుగు భాషల్లో  బైలింగువల్‌ చేయాలనే ఆలోచన ఉంది. తెలుగు ఇండస్ట్రీనే నాకు ముఖ్యం. క్రికెట్‌ నాకు ఓన్లీ స్ట్రెస్‌ బస్టర్‌ మాత్రమే. న్యూ ఇయర్‌ అన్నయ్య(నాగచైతన్య), వదినలతో(సమంత)సెలబ్రేట్‌ చేసుకుంటా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top