ఇదో రొమాంటిక్ పెన్సిల్ | gv prakash next movie pencil | Sakshi
Sakshi News home page

ఇదో రొమాంటిక్ పెన్సిల్

Mar 22 2016 11:33 PM | Updated on Sep 3 2017 8:20 PM

ఇదో రొమాంటిక్ పెన్సిల్

ఇదో రొమాంటిక్ పెన్సిల్

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథా నాయకుడిగా మరోసారి తెరపై అలరించనున్నారు.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథా నాయకుడిగా మరోసారి తెరపై అలరించనున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన మణి నాగరాజ్ దర్శక త్వంలో ప్రముఖ పంపిణీదారుడు జి.హరి నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం‘పెన్సిల్’ (తమిళ పేరు ‘మాలై నేరత్తు మయక్కమ్’). తెలుగ మ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గౌతమ్ మీనన్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కళాశాల నేపథ్యంలో సాగే చిత్రమిది. యూత్ ఫుల్‌గా సాగిపోయే ఈ కథలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ప్రధానంగా యువతకి నచ్చే సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న తెలుగు, తమిళాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement