మమమ్మమ్మాస్... | Gopichand new movie first look will release on diwali | Sakshi
Sakshi News home page

మమమ్మమ్మాస్...

Oct 17 2016 10:58 PM | Updated on Sep 4 2017 5:30 PM

మమమ్మమ్మాస్...

మమమ్మమ్మాస్...

బి. గోపాల్ మంచి మాస్ డెరైక్టర్. గోపీచంద్ మంచి మాస్ హీరో. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా అది

బి. గోపాల్ మంచి మాస్ డెరైక్టర్. గోపీచంద్ మంచి మాస్ హీరో. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా అది మమమ్మమ్మాస్ అనేలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని బాలాజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ దీపావళికి టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వక్కంతం వంశీ అందించిన పవర్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. బి. గోపాల్‌గారి వంటి యాక్షన్ డెరైక్టర్, గోపీచంద్, నయనతారతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
 
అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మగారు స్వరాలు సమకూరుస్తున్నారు. క్లయిమాక్స్ మినహా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. నవంబర్‌లో పాటలు, డిసెంబర్‌లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, చలపతిరావు, ఉత్తేజ్, జయప్రకాశ్ రెడ్డి, రమాప్రభ, సురేఖావాణి, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement