‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’

Gopi mohan Directorial debut Update - Sakshi

రచయితలుగా ఘనవిజయాలు సాధించిన చాలా మంది సినీ ప్రముఖులు దర్శకులుగానూ సత్తా చాటుతున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌,  కొరటాల శివ లాంటి వారు టాప్‌ డైరెక్టర్స్‌గా ఎదిగారు. తాజాగా మరో స్టార్‌ రైటర్‌ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన పలు విజయవంతమైన చిత్రాలకు కోన వెంకట్‌తో కలిసి రచయితగా పనిచేసిన గోపీమోహన్‌ దర్శకుడి తొలి సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

చాలా కాలంగా దర‍్శకుడిగా తొలి ప్రయత్నం చేసేందుకు రెడీ అవుతున్న గోపీమోహన్‌ ప్రేమికుల రోజు సందర్భంగా మరో అప్‌ డేట్ ఇచ్చారు. గతంలోనే సినిమా టైటిల్‌ ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’ అని ప్రకటించిన గోపీమోహన్‌ ‘ఈ కథని ఇష్టంగా సంతోషంగా ఆనందంగా మీకు చెప్పాలని  నా మనసు కోరుకుంటోంది. అతి త్వరలో మీకు నచ్చిన తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకు ,నా ప్రియమైన భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

Back to Top