అంతకు మించి...

Gopi Chand New Movie Launch Under SVCC Banner - Sakshi

గోపీచంద్‌ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ‘సాహసం’ చిత్రం ఘనవిజయం సాధించింది. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ఇప్పుడు మరోసారి గోపీచంద్‌–బీవీఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఆరంభమైంది. సంతోష్‌ శివన్, ‘జయం’ రాజాల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

బీవీఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘సాహసం’ తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బిను సుబ్రమణ్యం చెప్పిన కథ చాలా బాగుంది. ‘సాహసం’ చిత్రం ట్రెజర్‌ హంటింగ్‌ పాయింట్‌ మీద ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో.. ఈ సినిమా దాన్ని మించి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. రాజీపడకుండా ఈ చిత్రం నిర్మిస్తాం. జూన్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సతీష్‌.కె ఛాయాగ్రాహకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top