గ్లామరస్‌గా నటించను | Glamorous acting | Sakshi
Sakshi News home page

గ్లామరస్‌గా నటించను

Mar 25 2014 12:28 AM | Updated on Sep 2 2017 5:07 AM

తాను గ్లామరస్‌గా నటించబోనని నటి రిత్తికా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు రిత్తికా శ్రీనివాస్. వళక్కు ఎన్ 18/9, నిమిర్నిందు నిల్ చిత్రాల్లో నటించి పేరు గడించారు.

 తాను గ్లామరస్‌గా నటించబోనని నటి రిత్తికా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు రిత్తికా శ్రీనివాస్. వళక్కు ఎన్ 18/9, నిమిర్నిందు నిల్ చిత్రాల్లో నటించి పేరు గడించారు. ఇటీవల విలేకరులతో ముచ్చటించారు. తన సొంత ఊరు చెన్నై అని, ప్రస్తుతం భర్తతో దుబాయ్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు.

లండన్, అమెరికా, దుబాయ్‌లో ఐ బ్రేకర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ నడుపుతున్నట్లు తెలిపారు. సినిమాలపై ఆసక్తితో నటించేందుకు వచ్చానన్నారు. మంచి క్యారెక్టర్ పాత్రలు ఎంపిక చేసి నటిస్తున్నానన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిరత్తిల్ ఇరువర్‌తోపాటు పేరు పెట్టని రెండు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.  రొటీన్ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్నవాటిలో నటించాలని ఉందన్నారు. ప్రస్తుతం డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తున్నానని, త్వరలో ఒక చిత్రా న్ని భర్తతో కలిసి నిర్మించనున్నట్లు తెలిపారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement