నాగబాబు కొత్త షో : వివరాలు వెల్లడించిన గెటప్‌ శ్రీను

Getup Srinu Reveals Nagababu New Show Vizil Preloaded Details - Sakshi

హైదరాబాద్‌ : ట్యాలెంట్‌ ఉన్న హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు నటుడు నాగబాబు డిజిటల్‌ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి స్టాండప్‌ కామెడీ షో, మరోకటి ‘అదిరింది’ మాదిరి కామెడీ స్కిట్స్‌ అని తెలిపారు. అందులో ఇప్పటికే స్టాండప్‌ కామెడీ షో.. ఖుషీ ఖుషీగా వివరాలను జబర్దస్త్‌ నటుడు బుల్లెట్‌ భాస్కర్‌ వెల్లడించారు. తాజాగా కామెడీ స్కిట్స్‌తో కూడిన షో వివరాలను జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను ఓ వీడియో ద్వారా వివరించారు.(రెండు రోజుల తర్వాత కరోనా అంటూ ఫోన్‌..!)

షో పేరు విజిల్‌.. ప్రీలోడెడ్‌ అని తెలిపారు. ఈ డిజిటల్‌ షోలో అవకావం దక్కించుకోవడానికి ఏం చేయాలో కూడా వివరించారు. ఆ తర్వాత ఎంపిక ప్రకియ ఎలా కొనసాగుతుందో కూడా తెలిపారు. ఎంపికైనవారికి ప్రోత్సహకాలు ఉంటాయని చెప్పారు. నాగాబాబు ఆధ్వర్యంలోని జడ్జిమెంట్‌ ప్యానల్‌ చివరకు.. ఆరు టీమ్‌లను ఎంపిక చేసి వాటి మధ్య ఫైనల్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వీరికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ షోలో పాపులర్‌ కమెడియన్స్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (హీరోయిన్‌ ఐశ్వర్య అర్జున్‌కు కరోనా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top