గాల్లో తేలినట్టుందే... | 'gallo thelinatlu vundhe' ia new flick from solo movie producer | Sakshi
Sakshi News home page

గాల్లో తేలినట్టుందే...

Jan 3 2014 2:35 AM | Updated on Sep 2 2017 2:13 AM

గాల్లో తేలినట్టుందే...

గాల్లో తేలినట్టుందే...

యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, కౌశల్య, మోనీషా ప్రధాన పాత్రధారులు.

యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, కౌశల్య, మోనీషా ప్రధాన పాత్రధారులు. వెంకటసురేష్ గుణ్ణం దర్శకుడు. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటోంది. వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ-‘‘‘సోలో’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. తొలి సినిమా మాదిరిగానే ఇది కూడా క్లీన్ ఎంటర్‌టైనర్. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల మూడోవారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శీలం లక్ష్మణ్, సహ నిర్మాత: భాస్కర్ విల్లూరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement