గలాట ఎందుకు? | 'galata' a love story | Sakshi
Sakshi News home page

గలాట ఎందుకు?

Oct 25 2013 1:09 AM | Updated on Sep 1 2017 11:56 PM

గలాట ఎందుకు?

గలాట ఎందుకు?

పూర్తి స్థాయి వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. నాయికా నాయకుల పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని దర్శకుడు కృష్ణ చెప్పారు.

‘‘పూర్తి స్థాయి వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. నాయికా నాయకుల పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని దర్శకుడు కృష్ణ చెప్పారు. శ్రీ, హరిప్రియ జంటగా క్రియేటివ్ పిక్సల్స్ ప్రొడక్షన్ పతాకంపై రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘గలాట’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో రెండో షెడ్యూలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘టైటిల్ తరహాలోనే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ గలాట ఎందుకనేది తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీ, హరిప్రియ, సాయికుమార్, నాగబాబు, రఘు కారుమంచి, వేణు తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబరులో మూడో షెడ్యూలు చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.
 

Advertisement
 
Advertisement
Advertisement