రోజుకు 14 బాటిళ్ల మద్యం తాగేస్తున్న హీరో | French actor drinks 14 alcohol bottles a day | Sakshi
Sakshi News home page

రోజుకు 14 బాటిళ్ల మద్యం తాగేస్తున్న హీరో

Sep 16 2014 12:50 PM | Updated on Sep 2 2017 1:28 PM

రోజుకు 14 బాటిళ్ల మద్యం తాగేస్తున్న హీరో

రోజుకు 14 బాటిళ్ల మద్యం తాగేస్తున్న హీరో

ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత హీరో గెరార్డ్ డెపార్డీ మాత్రం బాటిళ్ల మీద బాటిళ్ల మద్యం తాగేస్తున్నాడు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత హీరో గెరార్డ్ డెపార్డీ మాత్రం తనకివేమిపట్టవని చెబుతున్నాడు. బాటిళ్ల మీద బాటిళ్ల మద్యం తాగేస్తున్నాడు. ఏ రోజైనా అతనికి బోర్ కొడితే ఉదయం నుంచి రాత్రికి ఏకంగా 14 బాటిళ్ల మద్యం లాగించేస్తాడట. గెరార్డ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయం చెప్పాడు.

గెరార్డ్ ఉదయం మద్యపానంతోనే దినచర్య మొదలుపెడతాడు. 10 గంటలలోపే రెడ్ వైన్ లేదా షాంపైన్ తీసుకుంటాడు. ఆ తర్వాత షాంపైన్.. భోజనంతో మరో రెండు బాటిళ్ల వైన్.. మధ్యాహ్నం షాంపైన్, బీర్.. సాయంత్రం హాఫ్ బాటిల్.. రాత్రికి వోడ్కా లేదా విస్కీ తీసుకుంటాడట. మొత్తమ్మీద ఆ రోజు 14 బాటిళ్ల మద్యం పూర్తి చేస్తాడట. టాక్స్ సమస్యల కారణంగా దేశం వెలుపల ఉంటున్న  గెరార్డ్ మద్యం తాగడం మొదలుపెడితే ఆ రోజంతా ఆపనని చెప్పాడు. విమానాశ్రయాల్లో మద్య తాగడం, యాక్సిడెంట్లు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement