‘అఖిల్ 3’ ఫస్ట్‌లుక్‌ రేపే..! | First look of Akhil 3 On Nagarjuna Birthday | Sakshi
Sakshi News home page

Aug 28 2018 3:24 PM | Updated on Jul 15 2019 9:21 PM

First look of Akhil 3 On Nagarjuna Birthday - Sakshi

అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన అఖిల్‌ తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా చేసిన హలో పరవాలేదనిపించినా తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో అఖిల్ మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది. అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా టీజర్‌ను కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేకపోయినా.. అఖిల్ 3 టీజర్‌తో నాగ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్‌, అఖిల్‌ లుక్‌తో పాటు సాంగ్‌ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నాగ్‌కు అక్కినేని వారసుడు ఇచ్చే గిఫ్ట్‌తో అభిమానులు కూడా పండగ చేసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement