 
															ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ లో స్పందనలు మొదలయ్యాయి.
	ముంబై: 'షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్' అంటూ వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్‌లో స్పందనలు మొదలయ్యాయి. జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి, దర్శకురాలు, అపర్ణా సేన్  దీనిపై సోషల్  మీడియాలో స్పందించారు. షారుక్ ఖాన్‌పై సాధ్వి ప్రాచీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన ఆమె  ట్విట్టర్‌లో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యల్ని  నమ్మలేకపోతున్నాన్నారు.   ఇలాంటి మాటలు దేశాన్ని విచ్ఛిన్నం  చేస్తాయన్నారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
	
	షారుక్ ఖాన్ మాటలను సమర్ధించిన అపర్ణ.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో మత సామరస్యానికి వ్యతిరేకమన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా పెరుగుతున్న దాడులకు ఇది సంకేతమన్నారు. పెరుగుతున్న మత అసహనానికి, దాడులకు నిరసనగా భారత రాష్ట్రపతికి ఒక లేఖను ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోడానికి అందరూ కలిసి నడవాలని... రాష్ట్రపతికి ఇచ్చే లేఖపై అందరూ సంతకం చేయాలని కోరారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
