'ఎ' సర్టిఫికేట్తో రిలీజ్కు అనుమతించండి | FCAT has recommended an A certification for the film Lipstick Under My Burkha | Sakshi
Sakshi News home page

'ఎ' సర్టిఫికేట్తో రిలీజ్కు అనుమతించండి

Apr 26 2017 10:08 AM | Updated on Sep 5 2017 9:46 AM

'ఎ' సర్టిఫికేట్తో రిలీజ్కు అనుమతించండి

'ఎ' సర్టిఫికేట్తో రిలీజ్కు అనుమతించండి

ఇటీవల సెన్సార్ బోర్డ్ తీరు తీవ్రంగా వివాదస్పదమవుతోంది. తమ పరిథి దాటి పలు చిత్రాలకు కట్స్ చెప్పటం, కొన్ని సినిమాలకు అసలు

ఇటీవల సెన్సార్ బోర్డ్ తీరు తీవ్రంగా వివాదస్పదమవుతోంది. తమ పరిథి దాటి పలు చిత్రాలకు కట్స్ చెప్పటం, కొన్ని సినిమాలకు అసలు సర్టిఫికేట్ జారీ చేయకుండా నిరాకరించడం లాంటి అంశాలతో సెన్సార్ బోర్డ్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొగా మరో సినిమా విషయంలో కూడా ఇదే వివాదం మొదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డ్ నిరాకరించింది.

స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా మహిళా దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదం పై చిత్రయూనిట్ సెన్సార్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. యూనిట్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్  లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాకు ఎ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement