హిందీలో రీమేక్‌ కానున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

Fan Touches Vijay Deverakonda Feets In Dear Comrade Promotion Show - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా ఎదిగిన విజయ్‌ దేవరకొండ తాజాగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినా కూడా ఏదోరకంగా విజయ్‌ పేరు సోషల్‌ మీడియాలో నానుతోంది. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్న విజయ్‌.. డియర్‌ కామ్రేడ్‌తో దక్షిణాదిన పాగా వేసేందుకు స్కెచ్‌ వేశాడు. అయితే డియర్‌ కామ్రేడ్‌ అనుకున్నంతగా మెప్పించలేకపోయింది.

అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌చేసిన విజయ్‌.. బాలీవుడ్‌లోనూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. అక్కడ ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ అయిన ఈ చిత్రంతో షాహిద్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టినా.. నటనలో మాత్రం విజయ్‌తో పోలిక తప్పలేదు. ఇక షాహిద్‌ పేరు కంటే బాలీవుడ్‌లో విజయ్‌ పేరే ఎక్కువగా వినపడింది. దానికి తోడు విజయ్‌ కూడా బాలీవుడ్‌ వెళ్లేందుకు సుముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకే డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించి బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేట్లుగా ఒప్పించాడు. ఇక ఈ రీమేక్‌లో విజయ్‌ నటిస్తున్నాడు అని ప్రచారం జరిగినా.. అధికారికంగా మాత్రం స్పందించలేదు. 

ఇలా బాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారిన విజయ్‌.. తాజాగా ఓ అభిమానిని ఓదారుస్తూ వైరల్‌ అయ్యాడు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఓ అభిమాని సడెన్‌గా వచ్చి తోయడంతో కిందపడిపోయాడు.. వెంటనే లేచిన విజయ్‌.. ‘మీరు ప్రేమ చూపిస్తున్నారా? లేక నాపై దాడి చేస్తున్నారా’ అని సరదాగా అడగడం.. అటుపై ఆ అభిమానిని ఏమి అనొద్దని సైగలు చేయడం.. దీంతో విజయ్‌కు తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటడం ఇలా ప్రతీ విషయంలోనూ విజయ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాడు. ఇక విజయ్‌ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌తో తీయబోతోన్న చిత్రంతో బిజీకానున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top