ఎర్రచీర సస్పెన్స్‌ | erra cheera movie released date announced | Sakshi
Sakshi News home page

ఎర్రచీర సస్పెన్స్‌

Jul 19 2019 12:13 AM | Updated on Jul 19 2019 12:13 AM

erra cheera movie released date announced - Sakshi

కారుణ్య చౌదరి

శ్రీకాంత్‌ కీలక పాత్రలో బేబి సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్య సుమన్‌బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. సత్యసుమన్‌ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్‌ సస్పెన్స్‌ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోయిన్‌ ప్రియాంక అగస్టీన్‌–రఘుబాబు– ఫిష్‌ వెంకట్‌లపై ప్రత్యేక పాట చిత్రీకరిస్తున్నాం.

ఇందులో చేజింగ్‌ సీన్స్, హారర్, కామెడీ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలో క్లయిమాక్స్‌ చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. మరోవైపు  నిర్మాణానంతర పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీకాంత్, కమల్‌ కామరాజు, అజయ్, శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘ఆగస్టు చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసి, సెప్టెంబర్‌ 20న సినిమా విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత తోట సతీష్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చందు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement