ఈ రోడ్డు 27 కి.మీ. | E road 27km movie | Sakshi
Sakshi News home page

ఈ రోడ్డు 27 కి.మీ.

Mar 12 2014 12:02 AM | Updated on Sep 2 2017 4:35 AM

సినిమాకు కథ ఎంత ముఖ్యమో దానికి పేరు కూడా అంతే ముఖ్యం. పేరు వినగానే చిత్రం చూడాలనే ఆసక్తి కలగాలి. ప్రస్తుతం కోలీవుడ్‌లో విభిన్న టైటిల్స్‌తో చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

 సినిమాకు కథ ఎంత ముఖ్యమో దానికి పేరు కూడా అంతే ముఖ్యం. పేరు వినగానే చిత్రం చూడాలనే ఆసక్తి కలగాలి. ప్రస్తుతం కోలీవుడ్‌లో విభిన్న టైటిల్స్‌తో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈరోడ్ 27 కి.మీ, శ్రీపట్టి వినాయక పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎ.మహాలక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎం.పి.మోహన్‌రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రముఖ ఎడిటర్. వేదం పుదిదు చిత్రం ద్వారా ఎడిటర్‌గా పరిచయమైన మోహన్‌రాజ్ తొలి చిత్రంతోనే ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా శీను చిత్రం ద్వారా తమిళ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డును గెలుచుకున్న ఈయన తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఎడిటర్‌గా పని చేశారు. 
 
 ఆయన తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన ఈరోడ్డు 27 కి.మి చిత్రం గురించి మాట్లాడుతూ, పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఈ రోడ్డు 27 కి.మి  అన్నారు. ప్రేమ, పోరాటం, సెంటిమెంట్ అంటూ జనరంజకమైన అంశాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. కోవైకు చెందిన ఇంజనీర్ శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మోడల్ శైలు, షామిలీ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చెప్పారు. ఇతర ముఖ్య పాత్రల్లో సింగముత్తు, కరాటే రాజా, ఉమా పద్మనాభన్, నళిని తదితరులు నటించినట్లు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement