దృశ్యం 2

Drishyam 2 starring Mohanlal and Meena to start soon with Jeethu Joseph - Sakshi

మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’ (2013). థ్రిల్లర్‌ కథాంశం, సస్పెన్స్‌ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్‌ చేశాయి. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్‌ అయింది. గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్‌ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్‌ అయింది.

చైనీస్‌ భాషలో రీమేక్‌ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్టు జీతూ జోసెఫ్‌ ప్రకటించారు. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటిస్తారట. మిగతా నటీనటులు మారతారని తెలిపారు. కేరళలో  సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top